ATP: ప్రముఖ హేతువాది, నాస్తిక సమాజ జాతీయ నాయకులు డాక్టర్ బైరి నరేష్ సోమవారం గుంతకల్లులో “బుద్ధ విహార్” ను సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మంత్రాలు, తంత్రాలు అంటూ రోగాలను నయం చేస్తాం అని చెప్పేవారు ఎక్కువయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి నాగయ్య, కె.ఎల్ స్వామిదాస్, జయరాం, శ్రీనివాసులు పాల్గొన్నారు.