తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతున్నాయని తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాబు బాలగురవం ఆరోపించారు. ప్రభుత్వం అనుమతించిన పరిమితిని మించి భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయని, రోజూ వందలాది లారీల ద్వారా ఖనిజాన్ని తరలిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.