NLR: చేజర్ల మండలం యనమదల గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీలో రూ. 18 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.