సత్యసాయి: ఉద్యాన పంటలను లాభసాటిగా మార్చేందుకు రూపొందించిన ‘ఫెర్టిగేషన్ – ఆటోమేషన్’ అవగాహన పోస్టర్ను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కలిసి ఆవిష్కరించారు. పుట్టపర్తి కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులను నేరుగా మొక్క మొదళ్లకే అందించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.