ఏలూరు: చింతలపూడి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణమోహన్ బుధవారం తెలిపారు. ఐటీఐ (మెకానిక్ డీజిల్)తో పాటు ఐదేళ్ల అనుభవం లేదా మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 23లోగా సంప్రదించాలన్నారు.