VZM: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించి మంచి పనితీరు కనబరిచిన అధికారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుందని JC సేధు మాధవన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపాలని సూచించారు.