NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని శనివారం ప్రకటనలో కోరారు.