2 thousand crores in Anantapur.. Police checked RBI money
2 Thousand Crores: అనంతపురం జిల్లాలోని పామిడి వద్ద వెహిల్ చెకింగ్ నిర్వహించిన పోలీసులు షాక్ తిన్నారు. మొత్తం 2 వేల కోట్లను తరలిస్తున్న 4 కంటైనర్లను పట్టుకున్నారు. అది చూసిన పోలీసులు ముందు షాక్కు గురయ్యారు. లోక్ సభ ఎన్నిల సందర్భంగా తనీఖుల చేస్తున్నారు. అలా పామిడి చెక్ పాయింట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. అందులో భాగంగా నాలుగు కంటైనర్లను ఆపి తనిఖీ చేశారు. ఇక్కో కంటైనర్లో రూ. 500 కోట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు వాహనాల్లో రూ. 2 వేల కోట్లు ఉన్నట్లు గుర్తించారు.
అయితే కంటైనర్లకు సంబంధించిన రికార్డులను పోలీసులు చెక్ చేశారు. ఆ నగదు అంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చెందినదని నిర్ధారించుకున్నారు. ఈ రూ.2 వేల కోట్లను ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తుందని అధికారులు వెల్లడించారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉండడంతో ఆ వాహనాలను పోలీసులు అధికారులు పంపించారు. నాలుగు కంటైనర్లను పక్కకు ఆపడంతో ఆ హైవేపై కొద్ది సమయం ట్రాఫిక్ నిలిచిపోయింది. తరువాత అన్ని వాహనాలను పోలీసులు చెక్ చేసి పంపిస్తున్నారు.