KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో శనివారం రైతు సంఘం గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా తమన్న, కార్యదర్శిగా బీసీ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడిగా టీ. రవి, సహాయ కార్యదర్శిగా బుల్లి వెంకటేశులు ఎంపికయ్యారు. ఇతర సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.