ప్రకాశం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. మార్కాపురం ఎస్సీ సెల్ నాయకులతో కలిసి కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.