AKP: రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో ఇవాళ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ అందుకూరి ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టాదారు పాసుపుస్తకంపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు మొత్తం తెలుస్తాయని అన్నారు. రైతులు పాస్ పుస్తకాలను పరిశీలించి పొరపాట్లు జరిగితే విఆర్వోకు ఫిర్యాదు చేయాలన్నారు.