VZM: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నియోజకవర్గ స్థాయి గ్రామ సంఘాల సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన 5G స్మార్ట్ ఫోన్లను బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీ నాయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలలో పనిచేస్తున్న 146 మంది సహాయకులకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడ భాస్కరరావు, చింతల రామకృష్ణ పాల్గొన్నారు.