SS: రొద్దం మండలం డొడగట్ట గ్రామంలోని రంగాపురంకు చెందిన టీడీపీ నేత ఆర్.జీ. హనుమంతు రాయుడు శనివారం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.