విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం 36వ వార్డులో పలు సామాజిక భవనాలను ప్రారంభించారు. కార్పొరేటర్ మేరీ జోన్స్ రాజుతో కలిసి రంగిరీజి వీధి SC కాలనీలో రూ.20 లక్షలతో, రెల్లి వీధి పోలమాంబ ఆలయం వద్ద రూ.17 లక్షలతో నిర్మించిన భవనాలను ఆయన జాతికి అంకితం చేశారు. వార్డుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.