ప్రకాశం: సింగరాయకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో తనిఖీలు చేపట్టి రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, తోపుడు బండ్లను తొలగించారు. ట్రాఫిక్కు అడ్డంకులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.