AKP: నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ట, కలశ స్థాపన మహోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.