కోనసీమ: ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించారు.