SKLM: పలాస జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మందసకు చెందిన సవర భాస్కరరావు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.