»Vijay Sethupathi Vududhala Part 1 Movie Trailer Release
Movie Trailer: ఆసక్తి రేపుతోన్న ‘విడుదల’ ట్రైలర్..15న రిలీజ్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay setupathi) 'విడుదల' సినిమాలో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 15వ తేదిన భారీ అంచనాల మధ్య రిలీజ్(Release) కానుంది. ఈ తరుణంలో తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాట నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో ప్రతి ఒక్కరూ తమ స్టార్ డమ్‌తో సినిమాలు(Movies) చేస్తూ దూసుకుపోతున్నారు. కంటెంట్ బావున్న సినిమాలను ప్రేక్షకులు సైతం ఆకాశానికెత్తుతున్న సంగతి తెలిసిందే. అందుకే చిన్న హీరోల దగ్గరి నుంచి పెద్ద హీరోల వరకూ మంచి కథాంశంతో సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో కమెడియన్లు సైతం హీరోలుగా మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో తమిళ్ ఇండస్ట్రీ కమెడియన్ సూరి(Comedian suri) కూడా ఒకరు. సూరి తన మేనరిజంతో, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.
‘విడుదల’ మూవీ ట్రైలర్ :
ప్రస్తుతం సూరి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘విడుదలై’. గత నెల 31న ఈ మూవీ తమిళంలో ‘విడుదలై’ సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు వెట్రిమారన్(Vetrimaran) దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే సినిమాను ‘విడుదల’ పేరుతో తెలుగులో రిలీజ్(Release) చేయనున్నారు.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay setupathi) ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 15వ తేదిన భారీ అంచనాల మధ్య రిలీజ్(Release) కానుంది. ఈ తరుణంలో తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాట నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
అడవి నేపథ్యంలో ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి(Vijay setupathi) ఈ మూవీలో కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఓ సాధారణ పోలీసు క్యారెక్టర్లో సూరి(Suri) కనిపించనున్నాడు. పెరుమాళ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం, ఆ ప్రయత్నంలోనే భాగంగా గిరిజనులను పోలీసులు హింసిస్తుండటం, ఆ టైంలో పెరుమాళ్ ఏం చేస్తాడు? సూరి కదలిక ఎలా ఉంటుందనే దానిపై కథ(Story) నడుస్తుంది.