Ramcharan Tej: రామ్ చరణ్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్!
ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సంక్రాంతి లేదా సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా మరో కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు చరణ్. కానీ హీరోగా కాదు..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej), యూవీ క్రియేషన్స్‌లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్లో ఫస్ట్ సినిమా అక్కినేని అఖిల్(Akkineni Akhil)తో ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. చరణ్ బ్యానర్లో సినిమా అంటే.. చరణ్ సపోర్ట్‌తో పాటు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అఖిల్‌కు కలిసొస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ నయా అప్డేట్ బయటికొచ్చాక.. అక్కినేని అభిమానులే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఊహించని విధంగా అఖిల్ ప్లేస్‌లో నిఖిల్‌ను హీరోగా ‘ది ఇండియా హౌస్’ అంటూ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
ఈ ప్రాజెక్ట్‌లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు నిఖిల్. అభిషేక్ అగర్వాల్‌తో నిఖిల్‌కు మంచి పరిచయం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో నిఖిల్ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ఈ సినిమాతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘ది ఇండియా హౌజ్’ స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథతో తెరకెక్కబోతోంది. అందుకే వీర్సావార్కర్ 140వ జయంతి సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు.
1905 బ్యాక్ డ్రాప్లో లండన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కార్తికేయ-2 సినిమాతో నిఖిల్, అనుపమ్ ఖేర్‌కు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ వచ్చింది. అందుకే ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా మారింది. పైగా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ బ్యానర్ కావడంతో.. ‘ది ఇండియా హౌజ్’ అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.