Sudhir Babu: ‘నవ దళపతి’ సుధీర్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా హరోంహర సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సుధీర్.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
Sudhir Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ అటెంప్ట్‌తో మెప్పిస్తున్నాడు. కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే.. ఒక నటుడిగా మాత్రం ఒక్కో సినిమాకి చాలా వేరియేషన్ని చూపిస్తు వస్తున్నాడు. చివరగా హరోం హర అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు సుధీర్. అయితే.. గత రెండు మూడు సినిమాల నుంచి నైట్రో స్టార్‌గానే టైటిల్ కార్డ్ వేసుకున్న సుధీర్ బాబు.. హరోంహర సినిమతో మరోసారి తన ట్యాగ్‌ని మార్చుకున్నాడు. హరోం హర టైటిల్ కార్డ్‌లో ‘నవ దళపతి’ సుధీర్ బాబు అని పడింది.
దీంతో.. ఇక నుంచి సుధీర్ టాగ్లైన్ నైట్రో స్టార్ కాకుండా.. నవ దళపతిగా మారిపోయాడు. ఇక ఇప్పుడు నవ దళపతిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్్తో ఇంతవరకు ఎప్పుడు చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. అంతేకాదు.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేయనున్నారు. ఈ సినిమాతో వెంకట్ కళ్యాణ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ లో రుస్తుం, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి.