హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న సుధీర్ బాబు.. లేటెస్ట్ ఫిల్మ్ మామా మశ్చీంద్రతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఈ సినిమా రిజల్ట్ ఎంత దారుణంగా ఉందంటే.. కేవలం రెండు వారాల్లోనే ఓటిటిలోకి రాబోతోంది.
Sudhir Babu: తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు సుధీర్ బాబు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో నటించాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేశాడు. మూవీ ట్రైలర్‌ను మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సినిమా పై సుధీర్ బాబు భారీ ఆశలు పెట్టుకున్నాడు. సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇదో కన్ఫ్యూజన్ డ్రామా.. రొటీన్ రివేంజ్ స్టోరీ అనే టాక్ సొంతం చేసుకుంది. సాలిడ్ హిట్ కొట్టాలనుకున్న సుధీర్ బాబుకి మళ్లీ నిరాశే ఎదురైంది.
సినిమా రిలీజ్ అయి మూడో రోజు కూడా పూర్తి కాకుండానే ఓటీటీ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 6న రిలీజ్ అయిన మామా మశ్చీంద్ర మూవీ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వస్తుందనే న్యూస్ షాకింగ్‌గానే ఉంది. ప్రైమ్ వీడియో ఇప్పటికే మామా మశ్చీంద్ర డిజిటల్ ప్రీమియర్ డేట్‌ను వెల్లడించింది. ఆహా ఓటీటీలో కూడామా స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ ఫ్లాప్ సినిమా రెండు ఓటీటీల్లోకి రానుండడం విశేషం. సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే దారుణాతి దారుణం ఈ సినిమా అని అంటున్నారు. బహుశా మూవీ మేకర్స్ పిక్చర్ ఫ్లాప్ అవుతుందనే ముందే ఊహించి.. ఓటీటీ డీల్‌ను ఇంత తక్కువ రోజులకు కమిట్ అయి ఉంటారు.