రిపబ్లిక్ సినిమా రిలీజ్ సమయంలో బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు సాయి ధరమ్ తేజ్. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దాంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కోలుకున్న తర్వాత వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా గంజాయి శంకర్‌గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
Ganjai Shankar: యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ చేసిన ‘విరూపాక్ష’ సినిమా సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు తేజ్. ఆ తర్వాత పవర్ స్టార్‌తో కలిసి ‘బ్రో’ సినిమాతో అలరించాడు. ఈ సినిమా తర్వాత 6 నెలల పాటు షూటింగ్స్‌కి బ్రేక్ ఇస్తానని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్నప్పటికీ.. ఇంకా ఫిట్‌గా కనిపించడం లేదు.
విరూపాక్ష సినిమాతో పాటు.. బ్రో సినిమాలో రిలీజ్ అయిన పాటల్లో కాస్త కష్టంగా స్టెప్పులు వేసినట్టుగా కనిపించాడు సాయి. అందుకే.. ఇకపై చెయ్యబోయే సినిమాల కోసం వంద శాతం బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఆడియెన్స్ నుండి తనపై ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. ఓ చిన్న సర్జరీ చేయించుకోవాలి, ఆ తర్వాత బలంగా తిరిగి వస్తాను. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు.. అని సాయి ధరమ్ తేజ్ ఈ డెసిషన్ తీసుకున్నాడు.
బ్రేక్ తర్వాత మాస్ డైరెక్టర్ సంపత్ నందితో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ రోజు నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యినట్టు సమాచారం. మూవీకి ‘గంజాయి శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ టాక్. జైలు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందట. ‘గంజాయి శంకర్’ టైటిల్‌ను సినిమాకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నాడు.