మరో రెండు వారాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు దసరా, మరోవైపు ప్రభాస్ సినిమాల అప్డేట్స్తో అసలు సిసలైన పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.
Prabhas: అక్టోబర్ నెల రాగానే ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని జోష్ వచ్చేస్తుంది. ఎందుకంటే.. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్. ఇదే నెలలో ప్రభాస్ బర్త్ డే ఉంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ జరుగుతాయి. ఈసారి కూడా సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు హడావిడి మొదలైపోయింది. కాకపోతే ఈసారి బర్త్ డేకి సలార్ మాస్ ట్రీట్ ఉండడం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన సలార్.. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా సలార్ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది. సలార్ ట్రైలర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సలార్‌తో పాటు ప్రభాస్ కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి నుంచి ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడట. అయితే అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న మారుతి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందా? లేదా అనే విషయంలోనే క్లారిటీ లేదు. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’, స్క్రిప్టు స్టేజ్‌లో ఉన్న హను రాఘవపూడి సినిమాల నుంచి ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి.. ఖచ్చితంగా ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కు దసరా పండగతో పాటు.. ప్రభాస్ అప్డేట్స్ మరింత ఖుషీ చేయనున్నాయి.