సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ పోస్ట్‌పోన్ అవడంతో.. చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు వెనక్కి, ముందుకి వెళ్లిపోయాయి. తాజాగా నితిన్ కూడా ముందుకే వచ్చాడు.
Salaar Affect: తెలుగు నుంచి నాలుగు సినిమాలు క్రిస్మస్ను టార్గెట్ చేసుకున్నాయి. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వెంకటేష్ ‘సైంధవ్’, సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాలు కూడా డిసెంబర్ 22నే డేట్ లాక్ చేసుకున్నాయి. అలాగే నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ సడెన్‌గా సలార్ డిసెంబర్ 22కి వస్తుందని ప్రకటించడంతో.. ఈ సినిమాలు మరో డేట్‌ని వెతుక్కోవాల్సి వచ్చింది.
సైంధవ్ సంక్రాంతికి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుందని ప్రకటించారు. హాయ్ నాన్న డిసెంబర్ 8న వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ నితిన్ మాత్రం డిసెంబర్ 8కి రావడానికి ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్ట్రా’ ఆర్డీనరి మ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 8న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వస్తున్నట్టు కొత్త పోస్టర్‌తో ప్రకటించారు. అదే రోజున వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, విశ్వక్ సేన్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నాయి. నాని కూడా డిసెంబర్ 7-8 వస్తున్నట్టు తెలుస్తోంది. హిందీ నుంచి రెండు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నితిన్ కూడా రేసులోకి వచ్చేశాడు. దీంతో డిసెంబర్ 8న టైర్ 2 హీరోల మధ్య బక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారనుంది. మొత్తంగా సలార్ వల్ల చాలా సినిమాల రిలీజ్ డేట్స్ డిస్టర్బ్ అయ్యాయని చెప్పొచ్చు.