»3 Thousand Crore Film Does Atlee Have That Much Of A Scene
3 Thousand Crore సినిమానా? అట్లీకి అంత సీన్ ఉందా?
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గురించి అందరికీ తెలిసిందే. ఓ కమర్షియల్ సినిమాను ఎలా ప్రజెంట్ చేయాలో అట్లీకి పర్ఫెక్ట్గా తెలుసని.. మరోసారి జవాన్ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు మూడు వేల కోట్లు టార్గెట్‌గా సినిమా చేస్తానని చెబుతున్నాడు.
3 Thousand Crore Film? Does Atlee Have That Much Of A Scene?
3 Thousand Crore: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన జవాన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టి. ఇంకా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు ముందు కేవలం తమిళ్ డైరెక్టర్‌గా ఉన్న అట్లీ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అట్లీ. ఇలాంటి సమయంలో చేసిన కామెంట్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తనకు ఓ హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని ఆశ్చర్య పరిచిన అట్లీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడగ్గా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
జవాన్ 1100 కోట్లకు పైగా వసూలు చేసిందని.. తన తదుపరి ప్రాజెక్ట్ కనీసం 3 వేల కోట్లు వసూలు చేయాలి. జరగాలంటే కచ్చితంగా షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించాలి.. అని ఎంతో ధీమాగా చెప్పాడు అట్లీ. ఈ యంగ్ డైరెక్టర్ టార్గెట్ భారీగానే ఉంది కానీ.. షారుఖ్, విజయ్ కలిసి నటిస్తారా? కలిస్తే మాత్రం ఖచ్చితంగా అట్లీ తన టార్గెట్ రీచ్ అవడం గ్యారెంటీ. కాకపోతే.. జవాన్ సినిమానే మనోళ్లు ఫక్తూ కమర్షియల్ అని తేల్చేశారు. నార్త్ వాళ్లకు కాస్త కొత్తగా అనిపించింది. ఒకవేళ షారుక్ కాకుండా.. సౌత్ హీరోలతో జవాన్ సినిమా తీసి ఉంటే డిజాస్టర్ అయి ఉండేది. ఏదో పఠాన్ జోష్‌లో.. షారుఖ్ క్రేజ్‌తో వెయ్యి కోట్లు వచ్చాయి. కాబట్టి.. అట్లీకి మూడు వేల కోట్ల సినిమా చేసే సీన్ ఉందా? పైగా రాజమౌళి ‘జవాన్’కు బాబు లాంటి సినిమాలు తీస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దని.. అసలు అట్లీకి అంత సీన్ ఉందా? అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.