Heroగా ‘మోక్షజ్ఞ’ రెడీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఙ హీరోగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. అందుకే బాలయ్య అలా చెప్పాడు.
Mokshajna ready: మామూలుగా సోషల్ మీడియాకు, కెమెరాకు కాస్త దూరంగా ఉండే మోక్షజ్ఞ.. ఈ మధ్య ఎక్కడో ఓ చోట వెయిట్ లాస్ అయిన కటౌట్‌తో కనిపిస్తునే ఉన్నాడు. ఆ మధ్య ఓ పెళ్ళిలో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటో చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా సెట్స్‌లోనూ శ్రీలీలతో కలిసి సందడి చేశాడు మోక్షజ్ఞ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చేశారు బాలయ్య. ఈ మూవీ షూటింగ్ జరిగినంత వరకు శ్రీలీల తనను చీచా అని పిలిచిందని.. అందుకే ఫ్యూచర్లో తను హీరోయిన్గా ఓ సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు బాలయ్య.
ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తన వాళ్లతో చెప్పానని, అప్పుడు తన కొడుకు మోక్షజ్ఞ కోపడ్డాడని, ఏం డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా.. నెక్స్ట్ కుర్ర హీరోని నేను వస్తున్నాను కదా? అని అన్నాడని చెప్పుకొచ్చారు. ఇది బాలయ్య ఫ్లోలో మాట్లాడినప్పటికీ.. ఇండైరెక్ట్‌గా మోక్షజ్ఙ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని క్లారిటీ ఇచ్చేసినట్టే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు మోక్షజ్ఙ ఎంట్రీ అదిగో, ఇదిగో అనుకున్న అభిమానులకు.. బాలయ్య మాటలు కిక్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే మోక్షజ్ఙ ఎంట్రీ కోసం పలువురు దర్శకులు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే టాక్ కూడా ఉంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.