Vignesh Sivan apologized to the star director's fans
Vignesh Shivan: విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా ఈ నెల థియేటర్లలో సందడి చేయనుంది. లోకేష్ కనగరాజ్‌కు సంబంధించిన ఓ ఇంటర్వూ వీడియోను విఘ్నేశ్ సోషల్ మీడియాలో లైక్ చేశారు. వీడియో ‘లియో’ కు సంబంధించిన రూమర్. ఈ పోస్ట్‌ను విఘ్నేష్ లైక్ చేయడంతో మీరు రూమర్స్‌ను ప్రోత్సహిస్తున్నారా? అని కొందరు ఆయన్ని కామెంట్లతో ట్రోల్ చేశారు. దీనికి విఘ్నేశ్ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
Dear Vijay sir fans , Loki fans … sorry for the confusion 🙏 without even seeing the msg , the context or the content of the video or the tweet , by jus seeing Loki’s interview I liked the video ! cos am a big fan of his works and his interviews and the way he speaks ! Am also… https://t.co/JIJymxI2mJ
‘నేను ఏదో ఆందోళనలో ఉండి లోకేష్ కనగరాజ్ వీడియోను లైక్ చేశాను. నేను అసలు ఆ వీడియో చూడలేదు. కేవలం అతని ఫొటో మాత్రమే చూశాను. లోకేష్ కనగరాజ్‌కు నేను వీరాభిమానిని. అందుకే అతని చూసిన వెంటనే లైక్ కొట్టేశా. ‘లియో’ సినిమా గురించి నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఆ సినిమా పేరు చూసి.. లైక్ కొట్టేశా కానీ ట్వీట్లో ఏముందో చూడలేదు. నేనే జాగ్రత్త చూడాల్సింది. అందరూ నన్ను క్షమించండి’ అని విఘ్నేశ్ పోస్ట్ చేశారు. లియో సినిమా కోసం విజయ్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి. విజయ్ కెరీర్లోనే ఇది పెద్ద హిట్ సాధిస్తుందని కూడా ఆ పోస్ట్‌లో తెలియజేశారు.