అసలు హీరోయిన్ శ్రీలీల ఏడ్చేంత పని బాలయ్య ఏం చేశారు? నందమూరి నటసింహం చేసిన పని వల్లే శ్రీలీల కంటతడి పెట్టుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. కానీ దానికి అసలు కారణం వేరే ఉంది.
Balayya: వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. వరంగల్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. శ్రీలీల మాట్లాడుతూ.. తన జీవితంలో లేని అనుభవాలను సినిమా ద్వారా బాలయ్య అందించారని ఎమోషనల్ అయింది. ‘ఒక హీరోయిన్గా చాలా సినిమాలు చేస్తున్నాను. వేర్వేరు సెట్స్‌కు వెళ్తున్నాను. సోల్ కనెక్ట్ క్యారెక్టర్ అనేది ప్రతీ సినిమాలో దొరకదు. బాలకృష్ణతో కలిసి పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. చివరి రోజు షాట్ అయిపోయి కట్ చెప్పిన తర్వాత తనకు మాటలు రాలేదు. అది నాకు చాలా ఎమోషనల్ టైమ్. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినా కూడా నేను అదే మూడ్‌లో కంటిన్యూ అయ్యాను. ఎందుకంటే దాన్నుంచి వెంటనే బయటకి రాలేకపోయాను. తన లైఫ్‌లో ఏ ఎక్స్పీరియన్స్ లేదో, అది ఈ సినిమా ద్వారా దొరికింది. మీ గొప్ప మనసుకి థాంక్యూ బాలయ్య..’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది శ్రీలీల.
దీనికి ఓ బలమైన కారణమే ఉంది. శ్రీలీల తండ్రి చిన్నప్పుడే వాళ్ళ అమ్మతో విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయారు. శ్రీలీల ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ సమయంలో.. శ్రీలీల తండ్రి అని చెప్పుకునే సదరు వ్యక్తి మీడియా ముందుకు వచ్చి.. శ్రీలీల తన కూతురు కాదని, తన భార్యతో విడిపోయిన తర్వాత తను పుట్టిందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో శ్రీలీలకు పెద్దగా ఫేమస్ అవలేదు కాబట్టి.. ఆ ఇష్యూ అంతా హాట్ టాపిక్ అవలేదు. భగవంత్ కేసరి సినిమా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. అందుకే.. చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైన శ్రీలల.. అది గుర్తు చేసుకుంటూ.. ఇండైరెక్ట్‌గా తను లైఫ్‌లో చూడలేని అనుభవాలు.. బాలయ్య ఈ సినిమాతో ఇచ్చారని ఎమోషనల్ అయింది. ఈ లెక్కన శ్రీలీలను బాలయ్య కూతురిలా ఎలా ట్రీట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.