డైరెక్టర్ వీవీ వినాయక్ ఆదితో సినీ కెరీర్ ప్రారంభించి, ఎన్నో హిట్ మూవీస్ అందించారు. ఎన్టీఆర్, ప్రభాస్‌తోనే కాదు సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరుతో కూడా సినిమాలు చేశారు.
VV Vinayak: తెలుగు కమర్షియల్ సినిమా గమనాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు వివి వినాయక్. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తుఫానులా వచ్చారు. ఈవీవీ సత్యనారాయణ, సాగర్, ఎస్వీ కృష్ణా రెడ్డి వంటి సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇంతకుముందు కమర్షియల్ దర్శకుల బాటలో నడిచినా, తన సినిమాలతో హీరోయిజాన్ని మరో స్థాయికి ఎలివేట్ చేశారు. అతని సినిమాల్లో యాక్షన్ ప్రధాన పాత్ర పోషించింది.
ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వినాయక్. బ్లాక్‌బస్టర్ అందించడమే కాకుండా పరిశ్రమను తన వైపు తిప్పుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మరో స్థాయికి పెరిగింది. నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా చేసి తన మార్క్ చూపించాడు. నితిన్‌తో మూడో చిత్రం దిల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ప్రేమకథ అయినప్పటికీ కామెడీ, పాటలతో యూత్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా వినాయక్ తన మాస్ మార్క్ మిస్ అవ్వలేదు.
నాలుగో సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ వచ్చింది. ఠాగూర్ మూవీకి దర్శకత్వం వహించే ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్‌తో సాంబ మూవీ చేశారు. బన్నీతో అల్లు అర్జున్‌కి మాస్ ఇమేజ్ ఇచ్చారు. ఫ్యామిలీ డ్రామాతోపాటు పూర్తి యాక్షన్ ఎలిమెంట్స్‌తో వెంకటేష్‌తో లక్ష్మీ మూవీ తీశారు. ప్రభాస్‌తో యాక్షన్ మూవీ యోగి తెరకెక్కించాడు.
రవితేజ నటించిన కృష్ణ సినిమాతో వినాయక్ తన సినిమాలకు వినోదాన్ని మిళితం చేసి తన పంథా మార్చుకున్నాడు. ఇది భారీ విజయంగా మారింది. అదుర్స్, నాయక్, అల్లుడు శీను వంటి సినిమాల్లో కామెడీ కీ రోల్ పోషించింది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150కి కూడా వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ మాస్ డైరెక్టర్ పుట్టిన రోజు నేడు.. హిట్ టీవీ టీమ్ విష్ చేసింది.