»Megastar Chiranjeevi Made Noise At The House Of Hero Srikanth On His Birthday
Megastar Chiranjeevi: శ్రీకాంత్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటుడు శ్రీకాంత్ ఇంట సందడి చేశారు. శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఇంటికి వెళ్లి కేక్ చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Megastar Chiranjeevi made noise at the house of hero Srikanth on his birthday
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, నటుడు శ్రీకాంత్ (Srikanth) ఇంటికి వెళ్లి అక్కడ సందడి చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో ఏటీమ్గా శ్రీకాంత్ నటించి చిరుకు ఎంతో చేరువయ్యారు. సొంత అన్నదమ్ముల బంధం వారి మధ్య ఏర్పడింది. శ్రీకాంత్ పుట్టిన రోజుని పురస్కరించుకుని శనివారం చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి స్వయంగా కేక్ కట్ చేయిచారు. తరువాత యంగ్ హీరో, శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో సరదాగా మాట్లాడారు.
శ్రీకాంత్ నివాసంలో ఉన్న పలు ఫొటోలు, అవార్డులు చూసి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్, దేవర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.