»Akkineni Akhil Akhil Is A Huge Project Announcement Time Fixed
Akkineni Akhil: అఖిల్ భారీ ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ ముహూర్తం ఫిక్స్?
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Akkineni Akhil: వివి వినాయక్ దర్శకత్వంలో తన పేరునే టైటిల్‌గా మార్చుకొని.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కికనేనిన అఖిల్. కానీ ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాల్లో.. ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే ఓ మోస్తారు హిట్ అందుకుంది. ఇక చివరగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో.. ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు అఖిల్. కానీ ఈసారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా.. మాసివ్ హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు.
గతకొద్ది రోజులుగా అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తునే ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనుందనే.. వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మాత్రం రావడం లేదు.
ఫైనల్‌గా ఈ సినిమాకి సంబంధించిన అప్టేట్ రేపో మాపో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే ఉంది. ఆరోజే కొత్త సినిమా ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. దీనిపై ముందస్తుగా ఓ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఖచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ అదిరిపోయే హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి అయ్యగారు ఏం చేస్తారో చూడాలి.