Akkineni Akhil: అక్కినేని అఖిల్ (Akkineni Akhil) మంచి హిట్ కోసం చూస్తున్నాడు. కెరీర్లో బంపర్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో ధీర అనే మూవీ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాలతో మరో సినిమా ఉండనుంది. ధీర ఒక షెడ్యూల్ పూర్తి చేసి.. శ్రీకాంత్ మూవీని సెట్స్ మీదకు తీసుకొస్తారని తెలిసింది. ధీర మూవీ పీరియాడికల్ కథతో వస్తోందని సమాచారం.
ధీర మూవీలో నటించే హీరోయిన్ కోసం చూస్తున్నారు. తనకు జోడీగా పూజా హెగ్డే పేరును అఖిల్ (Akhil) చెప్పాడట. పూజా అంటే మినిమం హిట్ ఉంటుంది. పూజాతో కలిసి చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ రకంగా తనకు లక్కీ అవుతుందని అఖిల్ అంటున్నారు. ధీర మూవీలో పూజా కావాలని అఖిల్ (Akhil) పట్టు బడుతున్నాడు. గుంటూరు కారం నుంచి వచ్చేసిన పూజా తెలుగు ఆఫర్ కోసం చూస్తోంది. అఖిల్ (Akhil) ఆఫర్ ఇవ్వడంతో చేసే అవకాశం ఉంది.
ఏజెంట్ మూవీ తర్వాత అన్నీ విషయాల్లో అఖిల్ (Akhil) జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాస్టింగ్ విషయంలో ఆచి తూచి మరీ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏజెంట్ మూవీ హీరోయిన్ సాక్షి వైద్య అంతగా ఇంప్రెస్ చేయలేదు. ధీర మూవీలో పూజాను తీసుకోవాలని బెట్టు చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాలతో చేసే మూవీలో హీరోయిన్ గురించి స్పష్టత రాలేదు.