KNR: తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషనరేట్ అధికారులు భారీగా చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికవ్వగా, హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ టి. కరుణాకర్ సహా పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకిత భావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.