»Kalki This Is The New Release Date Of Kalki Almost Final
Kalki: ‘కల్కి’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఆల్మోస్ట్ ఫైనల్?
ఎట్టకేలకు సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు ప్రభాస్. కానీ కలెక్షన్స్ పరంగా వెయ్యి కోట్లను రీచ్ కాలేకపోయాడు. అయితే.. ఈసారి మాత్రం వెయ్యి కోట్ల బొమ్మ ఇస్తాడనే నమ్మకంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు.
Kalki: ప్రభాస్ నటిస్తుస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కల్కి.. బడ్జెట్ పరంగానే కాదు, రిలీజ్ పరంగా కూడా హాలీవుడ్ రేంజ్లో రాబోతోంది. ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి. గ్రాఫిక్స్ పరంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూపర్ క్లియర్‌గా ఉన్నట్టుగా అర్థమైపోయింది. దీంతో కల్కి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ మే 9న రావాల్సిన కల్కి 2898 ఏడి.. దాదాపుగా పోస్ట్ పోన్ అయిపోయినట్టే.
ఎలక్షన్స్ కారణంగా కల్కిని వాయిదా వేస్తున్నట్టుగా టాక్ ఉంది. త్వరలోనే కల్కి కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి కల్కి రిలీజ్ ఎప్పుడు? అంటే, ఇప్పుడో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కల్కి పోస్ట్ పోన్ అయితే.. రెండు మూడు నెలలు వెనక్కిపోతుందని అనుకున్నారు. మే నుంచి ఆగస్ట్ మధ్యలో కల్కి రిలీజ్ ఉంటుందనే మాట వినిపించింది. కానీ డిలే చేయకుండా.. మే నెలలోనే కల్కి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. కేవలం మూడు వారాలు మాత్రమే కల్కి మూవీని వాయిదా వేయనున్నట్టుగా తెలుస్తోంది.
మే మంత్ ఎండింగ్లో 30 లేదా 31 రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి.. ఓపెనింగ్స్, కలెక్షన్ల గురించి టెన్షన్ అక్కర్లేదని ఎగ్జిబిటర్లు వివరించి చెప్పినట్టు సమాచారం. అప్పటివరకు పొలిటికల్ హీట్ కూడా తగ్గుతుంది కాబట్టి.. మే నెలలోనే కల్కి రావడం పక్కా అంటున్నారు. మరి మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.