హిట్, ఫట్‌తో సంబంధం లేదు.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సూపర్ మహేష్ బాబు బావ అనే ముద్రను చెరిపేసుకొని స్టార్ హీరోగా నిలబడాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఏం లాభం లేటెస్ట్ సినిమా కూడా పోయినట్లేనని అంటున్నారు.
Sudhir Babu.. This movie is also in the flop list!
Sudhir Babu: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా.. థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, మిర్నలిని రవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో నటించాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేశాడు. దీంతో మామా మశ్చీంద్ర ఇంట్రెస్టింగ్గా మారింది. పైగా ఈ సినిమా ట్రైలర్‌ను మహేష్ బాబు లాంచ్ చేశాడు. దీంతో సుధీర్ బాబు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసినట్టుగా రివ్యూలు వస్తున్నాయి.
లావుగా కనిపించిన పాత్రలో సుధీర్ బాబును చూడలేకపోయామనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదో కన్ఫ్యూజన్ డ్రామా.. రొటీన్ రివేంజ్ స్టోరీ అనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో సాలిడ్ హిట్ కొట్టాలనుకున్న సుధీర్ బాబుకి మళ్లీ నిరాశనే ఎదురైంది. కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని సుధీర్‌కు సూచిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సుధీర్ చేస్తున్న రెండు, మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరోంహర, పుల్లెల గోపీచంద్ బయోపిక్, మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతోనైనా బాబు కంబ్యాక్ ఇవ్వాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.