విల్ హెల్మినా లాంకాస్టర్(Will Helmina Lancaster) మృతదేహం నాలుగేళ్లు అయినా ఛిద్రమవ్వకుండా ఉంది. క్యాథలిక్ రికార్డుల ప్రకారం ఇలాంటి ఘటనలు 100 వరకూ జరిగినట్లు సమాచారం. అయితే సిస్టర్ లాంకాస్టర్ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ నన్ కావడంతో ఆ ఘటన దైవ కృపగా భావించి క్యాథలిక్కులు పెద్ద సంఖ్యలో ఆమెను కొలుస్తున్నారు.
సాధారణంగా మృతదేహానికి(DeadBody) అంత్యక్రియలు నిర్వహించిన కొన్ని రోజులకు శరీరం ఛిద్రమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజులకు కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. అయితే ఇక్కడొక నన్ మృతదేహం నాలుగేళ్లయినా చెక్కుచెదరలేదు. ప్రస్తుతం ఆ శవాన్ని దర్శించుకునేందుకు అమెరికాలోని మిసౌరీ(Missouri) నగరంలో ప్రజలు క్యూకడుతున్నారు. విల్ హెల్మినా లాంకాస్టర్(Will Helmina Lancaster) అనే నన్ ఓ క్రైస్తవ మత సంస్థకు వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
2019లో సిస్టర్ విల్ హెల్మినా(Will Helmina Lancaster) మరణించారు. చనిపోయాక ఆమె మృతదేహాన్ని(DeadBody) శవపేటికలో భద్రపరిచి మిసౌరీలోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఎముకలను చర్చిలో భద్రపరచాలని చర్చి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 18న ఆమె మృతదేహం ఉన్న శవపేటికను బయటకు తీసి దానిని తెరిచారు. ఆ నన్ శవం పూడ్చిపెట్టినప్పుడు ఎలా ఉందో తెరిచిన తర్వాత కూడా అలానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
విల్ హెల్మినా లాంకాస్టర్(Will Helmina Lancaster) మృతదేహం నాలుగేళ్లు అయినా ఛిద్రమవ్వకుండా ఉంది. క్యాథలిక్ రికార్డుల ప్రకారం ఇలాంటి ఘటనలు 100 వరకూ జరిగినట్లు సమాచారం. అయితే సిస్టర్ లాంకాస్టర్ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ నన్ కావడంతో ఆ ఘటన దైవ కృపగా భావించి క్యాథలిక్కులు పెద్ద సంఖ్యలో ఆమెను కొలుస్తున్నారు. మృతదేహాన్ని(DeadBody) చూడ్డానికి క్యూకడుతున్నారు. ఈ ఘటనపై వైద్యులు సైతం స్పందిస్తూ..కొన్ని మృతదేహాలకు లేపనాలు పూయడం వల్ల ఐదారేళ్లు అయినా డీకంపోజ్ కావని, శరీరం ఎముకల గూడుగా మారేందుకు చాలా సమయం పడుతుందని ఫోరెన్సిక్ నిపుణుడు నికోలస్ వెల్లడించారు.