నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
మనుషుల జీవితాల్లో టీ(Tea), కాఫీ(Coffee) భాగమైపోయింది. నిద్రలేవగానే టీ, కాఫీ తాగనిదే పొద్దు గడవదు. కొంత మంది కమ్మని కాఫీ(Coffe) కోసం పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఈ కాఫీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది అరకు(Araku) కాఫీనే. ఇప్పుడు అరకు కాఫీ(Araku Coffee)కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాలుగేళ్లుగా జీసీసీ ఈ విషయంలో కృషి చేయడంతో ఇప్పటికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు అరకు కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించింది.
అంతర్జాతీయ మార్కెట్లో(International Market) అరకు కాఫీ(Araku Coffee)కి మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పుడు ఆర్గానిక్ బ్రాండ్‌తో మరింత క్రేజ్ రానుంది. అరకు అంటే ప్రకృతి అందాలకే కాకుండా కాఫీ తోటలకు కూడా గుర్తింపు ఉంది. గిరిజనుల సహకారంతో జీసీసీ ఈ మైలు రాయిని అధిగమించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1300 మంది గిరిజన రైతులు 2 వేల 184 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ వచ్చింది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి అక్కడున్న కాఫీ తోటల రైతులకు సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని కాఫీ రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.