Agniveer Notification: 1365 అగ్నివీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అగ్నీవీర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రభుత్వం(Central Government) అగ్నిపథ్ స్కీమ్(Agnipath scheme)లో భాగంగా మరో నోటిఫికేషన్ను విడుదల(Notification scheme) చేసింది. భారత నౌకాదళంలో 1365 అగ్నివీర్(Agniveer) ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందులో పురుషులకు 1120, మహిళలకు 273 ఖాళీలు ఉన్నాయి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్(INS)లో నవంబర్ 23 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ, బయోలజీ, కంప్యూటర్ సైన్స్లల్లో ఏదోక సబ్జెక్టులో ఇంటర్ చదవి ఉండాలి. అదేవిధంగా నవంబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 31, 2005 మధ్యలో జన్మించినవారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పురుషుల(Mens) ఎత్తు 157 సెంటీమీటర్లు, మహిళల(Womens) ఎత్తు 152 సెంటీమీటర్లు కచ్చితంగా ఉండేవారే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు జూన్ 15వ తేది నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు రూ.550లు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా ఇవ్వనున్నారు.