MNCL: బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన వర్షిత మరణించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు వర్షిత నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించిన ఈ నేత్రాల ద్వారా మరో ఇద్దరికి చూపు లభించనుంది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో జరిగిన ఈ సాహసోపేత నిర్ణయాన్ని పలువురు కొనియాడారు.