W.G: ఆకివీడు మాదివాడలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన షెడ్డును ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురువారం ప్రారంభించారు. రూ.6.5 లక్షలతో కొటికలపూడి నాగ రవీంద్ర కుమార్-విజయ వాణి దంపతులు షెడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. టీడీపీ నాయకులు మోటుపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.