PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా సర్పంచ్ భూక్య సంగీత సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ.10 లక్షలతో ప్రధాన రహదారి నుంచి మామిడిపల్లె వరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.