WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామ దర్గా చెరువు తూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. స్థానిక సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. చెరువు తూమ్లు పూడుకుపోయి పంటలకు సాగునీరు అందకపోవడంతో ఇటీవల వాటికి మరమ్మతులు చేయించారు. ఈరోజు పూజలు నిర్వహించి, తిరిగి తూమ్ను ప్రారంభించారు.