»Ola Trying No Cancellation Feature Called Prime Plus For Select Bengaluru Customers
OLA: ఓలా క్యాబ్స్ సరికొత్త సర్వీస్..!
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
ఓలా క్యాబ్స్(Ola cabs) బెంగళూరులోని ఎంపిక చేసిన కస్టమర్లతో ‘ప్రైమ్ ప్లస్’ (Prime Plus) అనే కొత్త ప్రీమియం సర్వీస్‌ను అందించాలని చూస్తుంది. ఈ విషయాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
“@Olacabs ద్వారా కొత్త ప్రీమియం సేవను ప్రారంభించాలని అనుకుంటున్నాం ! ప్రైమ్ ప్లస్: ఉత్తమ డ్రైవర్లు, టాప్ కార్లు, క్యాన్సిలేషన్ లాంటి అవాంతరాలు లేకుండా ఉండేలా ఈ సేవలు ప్రారంభించాలి అనుకుంటున్నాం. ఈరోజు బెంగళూరులో ఎంపిక చేసిన కస్టమర్ల కోసం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. దీన్ని ప్రయత్నించండి. నేను దీన్ని తరచుగా ఉపయోగిస్తాను. ఇక్కడ ట్విట్టర్లో నా అనుభవాలను పంచుకుంటాను.’ అంటూ ఆయన షేర్ చేశారు.
అతను ఓలా యాప్‌లో ఎంపిక కోసం ప్రైమ్ ప్లస్ (Prime Plus) ఎంపికను చూపే స్క్రీన్‌షాట్‌ను కూడా జోడించాడు. తన అనుభవాలను పంచుకుంటానని చెప్పాడు. నిజానికి మనం క్యాబ్ బుక్ చేస్తుంటే కొన్ని సార్లు డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రైమ్ ప్లస్ సర్వీస్ లో అలా వారు క్యాన్సిల్ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. కచ్చితంగా క్యాబ్ బుక్ అయ్యేలా ఈ సదుపాయాన్ని తీసుకువస్తుండటం విశేషం.