Director Teja: షకీలాను అలా చూసి ఆఫర్ ఇచ్చా.. తేజ కామెంట్స్ వైరల్!
చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఓ ఊపు ఊపేసని డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం రేసులో వెనకబడిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా.. వాళ్ల దగ్గరికి వెళ్లను అంటాడు తేజ. అసలు తేజ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. తాజాగా షకీలా క్రేజ్ చూసి ఆశ్యర్యపోయానని.. అందుకే ఆమెకు ఆ ఆఫర్ ఇచ్చానని చెప్పడం వైరల్‌గా మారింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజ.. ఆ మధ్య రానా దగ్గుబాటితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కానీ ఆ తర్వాత ‘సీత’ సినిమాతో మెప్పించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తర్వాత రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తూ.. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘అహింస’ అనే టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. జూన్ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. గీతిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. తేజ, అభిరాం వరుస పెట్టి ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు కుర్రకారును నిద్ర లేకుండా చేసిన షకీలా గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈమె గురించి తేజకు మాత్రం తెలియదట. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు తేజ. అలాగే జయం సినిమాలో ఆమెను ఎలా తీసుకున్నాడో కూడా చెప్పాడు. జయం సినిమా మొదలవడానికి ముందు తేజ.. ఆర్పీ పట్నాయక్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్‌లో కార్లో వెళ్తుండగా.. కాచిగూడలోని తారకరామా థియేటర్లో జనాలు గుంపులు గుంపులగా ఉన్నారట.
థియేటర్ గేట్లు ఓపెన్ చేయగానే కుర్రాళ్లందరూ లోపలికి పరుగులు తీశారట. అంతగా జనాలను పిచ్చేకించే సినిమా ఏం అయి ఉంటుందని చూస్తే.. కామేశ్వరి అనే పోస్టర్ కనిపించందట. దీంతో వెంటనే కార్ దిగి వెళ్లి థియేటర్ మేనేజర్ని అడిగి మూడు టికెట్లు కొనుక్కుని లోనికి వెళ్లారట. ఇక షకీలా తెరపై కనపడగానే కుర్రాళ్లందరూ హారతులు పడుతన్నారట. ఆమే క్రేజ్ చూసి తేజ ఆశ్చర్యపోయాడట. ఆ సమయంలోనే జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు షకీలాను ఓకె చేసినట్టు చెప్పుకొచ్చాడు. తను నటీనటులను ఎంపిక చేసే విధానం అలా ఉంటుందని తేజ చెప్పుకొచ్చాడు.