ఏలూరు: ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కేపీడీటీ హైస్కూల్లో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 1,497 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్, ఫార్మసీ చేసినవారు అర్హులన్నారు.