KNR: ఆన్లైన్ ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ రీజియన్ చీఫ్ మేనేజర్ విజయ్ సింగ్ సూచించారు. ముల్కనూరులో ఆర్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు.