AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో రెల్లిహక్కుల పోరాట సమితి సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ.. అన్ని రంగాలలో అభివృద్ధికి నోసుకొని రెల్లిలకు సామాజిక సమన్యాయం జరగాలంటే వర్గీకరణ పునః పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రెల్లిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.