ATP: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఏర్పడిన ఆటంకాలను పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పౌరసరఫరాల శాఖ భవనంలో జరిగిన సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.