పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా చేస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ మూవీకి హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ(Gabbar singh Movie) తెరకెక్కింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) అద్భుతమైన మ్యూజిక అందించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ నే ఎంచుకున్నాడు.
పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు.
ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మొదటి షెడ్యూల్ పూర్తవ్వడంతో పవన్(Pawan Kalyan) ఓజీ మూవీ షూటింగ్ లోకి షిఫ్ట్ అయిపోయారు. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా గ్యాప్ ఉండటంతో మూవీకి సంబంధించిన ఇతర వర్క్స్ పూర్తి చేసే పనిలో డైరెక్టర్ హరీష్ శంకర్ పడ్డాడు. ఈ మూవీలోని పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడు. అందుకోసమే దేవిశ్రీ(Devisri prasad)తో కలిసి ముచ్చట్లు పెట్టేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.